Sentence
stringlengths
7
4.52k
ఇంటర్ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలకు 1517 కేంద్రాలు ఏర్పాటు చేసిందని, మరో 449 కేంద్రాలను వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు సిద్ధం చేశామని, థియిరీ పరీక్షలకు 1317 కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు
హాకాభవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ, వ్యవసాయంతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలన్నారు
ఇందుకు సంబంధించి కేంద్రానికి లేఖ రాశానని చెప్పారు
రైతులకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు
2020లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు
రాష్ట్రంలోని 240 మండలాల్లో ఆయిల్పామ్ సాగు చేసేందుకు అనుకూల వాతావరణం ఉందని, కనీసం ఏడు లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయించాలని భావిస్తున్నామన్నారు
మిద్దెలపై, ఇళ్ల ఆవరణలో పూలు, కూరగాయల పెంపకం చేసేందుకు అవకాశం ఉందని, దీని వల్ల రసాయనాలు లేని ఆహార పదార్థాలు లభిస్తాయన్నారు
పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలన్నారు
అధికార టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు అంజనీకుమార్ తాబేదారుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు
గాంధీభవన్లో సోమవారం శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు
శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ కమిషనర్ ఫక్తు అధికార పార్టీ నాయకుడిగా వ్యవహరించడం పోలీస్ వ్యవస్థ తలదించుకునేలా చేశారని విమర్శించారు
అధికార పార్టీ, ఎంఐఎం పార్టీల ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలకు సీసీ అంజనీకుమార్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు
కాంగ్రెస్ పార్టీ ఏమి తీవ్రవాద సంస్థ కాదని, ఈ దేశంలో బాధ్యతగలిగిన రాజకీయ పార్టీ అనే విషయాన్ని సీపీ గుర్తించుకోవాలన్నారు
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన శాంతి యాత్రకు అనుమతి ఇవ్వని కమిషనర్, ఆర్ఎస్ఎస్, ఎంఐఎం సభలు, సమావేశాలకు ఎలా అనుమతి ఇచ్చారని శ్రవణ్ ప్రశ్నించారు
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఏమిటో సీపీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు
తలసాని చరిత్ర ఏమిటో తెలుసు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను శ్రవణ్ తీవ్రంగా ఖండించారు
ఉత్తమ్కుమార్రెడ్డిని విమర్శించే స్థాయి తలసానికి లేదని మండిపడ్డారు
దేశ సరిహద్దులో ప్రాణాలకు తెగించి పని చేసిన నిబద్ధతగలిగిన పైలెట్ ఉత్తమ్కుమార్రెడ్డి అని గుర్తు చేశారు
బోగస్ సంస్థల వల్ల రాష్ట్రానికి వచ్చే దేశీయ, విదేశీ పర్యాటకులకు అసౌకర్యం కలుగకుండా నిబంధనలపై రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్తో సోమవారం చర్చించారు
రాష్ట్రంలో పర్యాట రంగం వేగంగా విస్తరిస్తోందని, పర్యాటక రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలున్నాయని, పర్యాటకాన్ని సమగ్రాభివృద్ధి కోసం ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు
ఉమ్మడి రాష్ట్రంలో తెంలగాణ పర్యాటక ప్రదేశాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు
అందులో భాగంగానే కాళేశ్వరం, లక్నవరం, సోమశిల, బుద్దవనం, మయూరి ఎకో పార్క్, రామప్ప, పిల్లలమర్రి, మానేరు డ్యామ్, అలంపూర్ జోగులాంబ, మల్లెల తీర్థం, మన్ననూరు వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు
టూర్స్ అండ్ ట్రావెల్స్ల అసోసియేషన్లు రాష్ట్రానికి దేశీయ, విదేశీ పర్యాటకులను పెద్దఎత్తున తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు
దీనికి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని తెలిపారు
ఈ సమావేశంలో రాష్ట్ర టూరిజం శాఖ ఎండీ మనోహర్, ఏపీ, తెలంగాణ టూర్స్ అసోసియేషన్ చైర్మన్ నగేష్, కార్యదర్శి సాయిబాబా బాదం, టూర్ అపరేటర్ హేమంత్ పాండే, సుధీర్ రెడ్డి, రమేష్, విక్రమ్ తదితర టూర్ ఆపరేటర్లు పాల్గొన్నారు
సోమవారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, మేయర్లు, డిప్యూటీ మేయర్ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో ఖరారు చేస్తారని, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల రిజర్వేషన్లను జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు ఖరారు చేస్తారని ఆయన తెలిపారు
రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశామన్న విషయం వాస్తమేనని, ఇది చట్టానికి లోబడే ఉందని ఆయన వివరించారు
కొత్త విధానంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశామని స్పష్టం చేశారు
దీనిని రాజకీయ పార్టీలు వక్రీకరించాయని, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు
మారిన విధానం గురించి అన్ని రాజకీయ పార్టీలకు అవగాహన ఉందని, ఈ నేపథ్యంలో మళ్లీ రాద్ధాంతం చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు
ఎన్నికల కమిషన్ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు
ఇటీవల తాము నిర్వహించిన అఖిలప సమావేశంలో గొడవ జరగడంతో పూర్తి వివరాలు చెప్పలేకపోయామని ఆయన విచారం వ్యక్తం చేశారు
కొత్త చట్టం ప్రకారమే ప్రభుత్వ అనుమతితో ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించామన్నారు
ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని నాగిరెడ్డి తెలిపారు
ఇప్పటికే వార్డులవారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేశామని, వీటిని సోమవారం నాడు అన్ని మున్సిపాలిటీల్లో ప్రకటించామన్నారు
అభ్యంతరాలు స్వీకరించి, పరిష్కరించిన తర్వాత జనవరి 4న తుది ఓటర్ల జాబితాలను వార్డుల వారీగా వెల్లడిస్తామన్నారు
ఈ నెల 8న ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందని, ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు
దాదాపు 40 వేల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని నాగిరెడ్డి తెలిపారు
ఈ సందర్భంగా మున్సిపల్ వ్యవహారాల డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ, 141 మున్సిపాలిటీలు కలిపి రాష్టస్థ్రాయిని యూనిట్గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నారు
120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు
రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చేస్తామన్నారు
ఈ సమావేశంలో ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా కొనసాగుతున్న ఎస్ కే జోషి మంగళవారం పదవీ విరమణ చేస్తున్నారు
సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే ఈ సభ ఐదు గంటల వరకు కొనసాగుతుంది
ఆ తర్వాత సీనియర్ అధికారులు మాట్లాడతారు
30 గంటలకు జోషి మాట్లాడతారు
ఆ తర్వాత జోషిని సన్మానిస్తారు
కొత్తగా సీఎస్గా నియామకమయ్యే అధికారి బాధ్యతలు స్వీకరిస్తారు
సోమవారం మిడ్మానేరు జలాశయం వద్ద ఆయన పూజలు చేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో గొప్ప సాఫల్యత సాధించినట్లు సంతోషంగా ఉందన్నారు
ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు జలాలతో సస్యశ్యామలం కాబోతోందని, తన జీవితంలో సఫలత్వం కలిగిందంటూ అక్కడ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులతో ఆనందాన్ని పంచుకున్నారు
తన జీవితంలో డిసెంబర్ 30 ఎన్నడూ లేనంత సంతోషం కలిగిస్తోందని సీఎం అన్నారు
మిడ్మానేరు జలాశయాన్ని ఆయన పరిశీలించారు
కాళేశ్వరం జలాలతో నిండిన జలాశయానికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు
అనంతరం కరీంనగర్ ఉత్తర తెలంగాణ భవన్కు చేరుకొని విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మిడ్మానేరు ప్రాజెక్టు పై నిల్చొని పూజలు చేస్తున్నప్పుడు చాలా ఆనందం కలిగిందని, జీవితంలో సఫలత్వం కలిగినట్లు అనుభూతి కలిగిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు
కాళేశ్వరం నీటితో నిండుకుండలా మారిన మధ్యమానేరు జలాశయ పరిశీలన నిమిత్తం సోమవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వచ్చిన ఆయన నగరంలోని ఉత్తర తెలంగాణ భవన్లో విలేఖరుల సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నిబద్ధతతో నిరంతరం శ్రమిస్తున్న తమ ప్రభుత్వంపై కొంత మంది రాజకీయ నాయకులు అవాకులు, చెవాకులు పేలుతున్నారని, వారి విమర్శలకు నిండుకుండలా మారిన నేటి కాళేశ్వరం, మధ్యమానేరు ప్రాజెక్టుల నిర్మాణాలే సమాధానమని ఘాటుగా వ్యాఖ్యానించారు
సీమాంధ్రుల పాలనలో అణచివేతకు గురైన తెలంగాణ ప్రజానీకాన్ని ఆయా పార్టీలు వ్యతిరేక ప్రచారంతో మరింతగా తొక్కిపెడుతున్నాయని ఆయన దుయ్యబట్టారు
ఎవరెంత వ్యతిరేకత ప్రదర్శించినా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ఇప్పటికే అభివృద్ధి దిశగా పయనిస్తున్న రాష్ట్రంలో ఇకపై చిన్ననీటి వనరుల సంరక్షణపై దృష్టి సారిస్తున్నట్లు ఆయన వెల్లడించారు
రాష్ట్ర వ్యాప్తంగా 1,230 చెక్ డ్యాములు నిర్మించనుండగా, వీటిలో రూ
1,250 కోట్లతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా నిర్మించనున్నట్లు సీఎం పేర్కొన్నారు
ఎస్సారెస్పీ నీటితో సంబంధం లేకుండా 50 టీఎంసీలు లోయర్, మిడ్ మానేరులో నింపుకున్నామని, మరో 60 టీఎంసీలు బ్యారేజీలో నింపే అవకాశం ఉందన్నారు
ఇకపై వర్షాలకోసం అన్నదాతలు మొగులు వైపు చూడాల్సిన అవసరం లేదని అన్నారు
2001లో గోదావరి తీర తెలంగాణలో కరవు ఉండకూడదని ఆకాంక్షించామని, ఆ కల కాళేశ్వరంతో నెరవేరిందన్నారు
మిడ్ మానేరును చూస్తే చాలా ఆనందంగా ఉందని, గోదావరి నదితో పాటు అనేక వాగులు ఉన్న కరీంనగర్ జిల్లా ఇంతకాలం కరవుతో అల్లాడిందన్నారు
ఇక కరవు కాటకాలు తొలగిపోయాయన్నారు
అనేకమంది ఈ జిల్లా నుంచి వలసలు వెళ్లారని, సిరిసిల్లలో ఆకలి చావులు ఉండేవని, తెలంగాణ వచ్చిన తరువాత ఈ జిల్లా ఎలా మారిందో కళ్లముందే కనిపిస్తోందన్నారు
జిల్లాలో 140 కిలోమీటర్ల గోదావరి 365 రోజులు ఇక సజీవంగా ఉంటుందని, భూగర్భ జలాలు పెరిగి, బోర్లు బయటకు పోస్తున్నాయన్నారు
కాకతీయ కెనాల్ 200 కిలోమీటర్ల దూరం పారుతోందని, మెట్పల్లి నుంచి హసన్పర్తి వరకు, 200 కిలోమీటర్ల మేరకు పంటలు పండుతున్నాయని, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయన్నారు
మరో నది మానేరు జిల్లాకు వరం లాంటిదని, ఇది 181 కిలోమీటర్ల మేర పారుతోందని, ఈ నదిని గతంలో ఎవరూ పట్టించుకోలేదన్నారు
మిడ్మానేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా గొప్ప పాత్ర పోషించబోతోందని, ఎల్లంపల్లి, మిడ్మానేరు మల్లన్నసాగర్ కీలక ప్రాజెక్టులుగా ఉంటాయన్నారు
40 వేల కోట్లతో రైతులు బోర్లు, మోటార్లు పెట్టుకున్నారని, 25, 27 లక్షల పంపుసెట్లు రాష్ట్రంలో ఉన్నాయన్నారు
జూన్లోగా జిల్లాలో చెక్ డ్యాంలు పూర్తిచేస్తామని, లండన్లోని థేమ్స్ నదిలాగా మానేరు సజీవంగా ఉంటుందని తాను గతంలోనే చెబితే కాంగ్రెస్, కాషాయ సన్నాసులు వెకిలి నవ్వులు నవ్వారని కేసీఆర్ మండిపడ్డారు
వచ్చే జూన్ నాటికి ఈ ప్రాంతం ఎలా మారబోతోందో అది చూస్తామని, తాను కలలుగన్న తెలంగాణ కన్పిస్తోందని అన్నారు
మిడ్ మానేరును నింపే క్రమంలో కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, మానేరులో సీపేజీల గురించి అవగాహన లేకుండా మాట్లాడొద్దన్నారు
15 టీఎంసీలు నింపినప్పుడు కొంచెం ఎక్కువగా సీపేజీ వస్తే టెస్ట్లు చేయించామని, ఆ సీపేజీ వచ్చిన ప్రాంతంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంట్రాక్ట్ పనులు గతంలో చేశాడని, కేసులు పెడితే ఆయనే జైలుకెళ్తాడన్నారు
కాళేశ్వరంపై ఎన్ని కేసులు వేసినా పట్టించుకోకుండా పనిచేశామన్నారు
పెద్దపల్లి, రామగుండం టేలెండ్ ప్రాంతాలకు కూడా నీరందుతుందని, కరీంనగర్ నుంచి సూర్యాపేట జిల్లా వరకు నీరు చేరుతుందని, త్వరలోనే ఎమ్మెల్యేలతో చెక్ డ్యాంలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే సిరిసిల్ల ప్రాంతం మరో పాపికొండలు కాబోతుందని, సాగునీటి రంగంలో తెలంగాణ కోసం కన్న కలలు సాకారం అవుతున్నాయని ఆయన అన్నారు
ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, టీఆర్ఎస్ నేతలు బి
వినోద్ కుమార్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, తుల ఉమ, ఎమ్మెల్యేలు వొడితెల సతీష్ కుమార్, సుంకె రవి శంకర్ తదితరులు ఉన్నారు
ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన ఆలయానికి చేరుకున్నారు
సీఎం కేసీఆర్ దంపతులు ఆలయంలోకి రాగానే ప్రధాన ద్వారం వద్ద ఈవో కృష్ణవేణి, స్థానాచార్యులు అప్పాల భీమన్న ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు
ఈ సందర్భంగా ఆలయంలో రాజన్న కోడెలకు సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు
ధ్వజస్తంభానికి సీఎం దంపతులు ప్రణమిల్లారు
గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీగణపతి స్వామివారికి సీఎం దంపతులతో వేదపండితులు తొలిపూజలను చేయించారు
అనంతరం శ్రీ రాజరాజేశ్వరస్వామికి అభిషేకాలు చేశారు
అక్కడి నుంచి శ్రీ రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు
సీఎం దంపతులకు కళ్యాణ మండపంలో వేదపండితులు ఆశీర్వదించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు
సీఎం వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, విద్యాసాగర్రావు, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ తదితరులు ఉన్నారు
స్వామివారి సేవలో మంత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు
వరంగల్లో ఆదివారం వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల రెండవ విడత పల్లెప్రగతి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు
ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ
30రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలులో వరంగల్ అర్బన్ జిల్లా రాష్ట్రంలో మూడవస్థానంలో నిలిచిందని, రెండవ విడతలో మొదటిస్థానంలో ఉండాలని అన్నారు
ప్రస్తుతం నిధుల కొరత లేదని గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసే ఆలోచనతోనే ప్రజా ప్రతినిధులు ముందుకు సాగాలని మంత్రి దయాకర్రావు తెలిపారు
సెప్టెంబర్ నుండి ప్రతి నెల రూ
339 కోట్లను ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం విడుదల చేస్తుందని చెప్పారు
ఉపాధిహామీ పనుల చెల్లింపు కోసం మూడు రోజుల క్రితమే రూ
84 కోట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారని, ప్రతి గ్రామపంచాయతీకి కచ్చితంగా నిధులు అందుతున్నాయని దయాకర్రావు అన్నారు
ఉపాధిహామీ పథకాన్ని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని, చేసిన పనులు సక్రమంగా ఉండాలని అక్రమాలకు అస్కారం లేకుండా చూసుకోవాలన్నారు