Sentence
stringlengths
7
4.52k
ప్రాజెక్టులోని నీరంతా పంట పొలాలను ముంచుతూ కిందకు వెళ్లిపోయింది
ప్రాజెక్టు ఆనకట్టకు దాదాపు 80 అడుగుల మేర కట్ట తెగిపోవడంతో ఒక్కసారిగా ప్రాజెక్టు అంతా ఖాళీ అయింది
ఉదయం పూట ప్రాజెక్టు ఆనకట్ట నుండి కిందకు నీరు వస్తుండడంతో నీరు ఎక్కడి నుండి వస్తోందని గమనించిన కొందరు రైతులు కట్ట దగ్గరకు వెళ్లి చూసేసరికి అర గంట వ్యవధిలోనే ఆనకట్టకు పడ్డ గండి పెద్దదిగా మారి కట్టను కోతకు గురి చేసింది
ఈ విషయాన్ని రైతులు గ్రామస్థులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి వచ్చేసరికి ప్రాజెక్టు నుండి నీరు ప్రవాహంలా పరుగులు తీస్తూ కిందకు వెళ్తోంది
దీంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది
కళ్ల ముందే పంటల సాగు కోసం నిల్వ ఉన్న నీరంతా వృథాగా కిందకు పోతుంటే రైతులు మాత్రం తీవ్ర ఆవేదనకు గురయ్యారు
ఈ విషయం గురించి రైతులు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డికి సమాచారం అందించారు
దాంతో మంత్రి నిరంజన్రెడ్డి సరళాసాగర్ ప్రాజెక్టు దిగువన గల రామన్పాడ్ ప్రాజెక్టు అధికారులను అప్రమత్తం చేశారు
ప్రాజెక్టు నుండి నీరు భారీగా వస్తుండడంతో ముందుజాగ్రత్తగా ప్రాజెక్టుకు సంబంధించిన 10 గేట్లను ఎత్తివేయాలని సూచించారు
దాంతో రామన్పాడ్ ప్రాజెక్టు అధికారులు పది గేట్లను ఎత్తివేసి కృష్ణా నదిలోకి నీటిని విడుదల చేశారు
సరళాసాగర్ ప్రాజెక్టు నుండి పెద్దవాగు ద్వారా రామన్పాడు ప్రాజెక్టులోకి ప్రవాహంలా నీరు వచ్చి చేరింది
సరళాసాగర్ ప్రాజెక్టుకు రామన్పాడ్ ప్రాజెక్టు కేవలం ఏడు కిలోమీటర్ల దూరం మాత్రమే కావడంతో కొన్ని గంటల్లోనే నీరు రామన్పాడ్ ప్రాజెక్టును తాకింది
నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని కృష్ణానదిలోకి నీరు వెళ్లేలా రామన్పాడ్ గేట్లను తెరిచారు
దాంతో కృష్ణానదిలోకి నీరు పరుగులు తీసింది
కాగా, సరళాసాగర్ ప్రాజెక్టు కింద రైతులు ఈ యాసంగి పంటలను సాగు చేసుకునేందుకు అంతా సిద్ధమయ్యారు
నారుమళ్లు కూడా వేసుకుని కరిగెట్లు చదును చేస్తున్న తరుణంలో ప్రాజెక్టుకు గండి పడటం రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది
సరళాసాగర్ ప్రాజెక్టు కింద కుడి ఎడమ కాలువల ఆయకట్టు దాదాపు 4,182 ఎకరాలు
32 ఎకరాలు కాగా ఎడమ కాలువ కింద 3,796
20 ఎకరాల ఆయకట్టు ఉంది
ఈ యాసంగి సీజన్లో మొత్తం ఆయకట్టు సాగు చేయడానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా గొలుసుకట్టు చెరువులు నింపుతూ సరళాసాగర్ ప్రాజెక్టును సైతం ప్రభుత్వం నింపింది
ఈ నేపథ్యంలో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకుంది
ప్రస్తుతం రైతుల పరిస్థితి అయోమయంగా మారింది
ప్రాజెక్టు అంతా ఖాళీ కావడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు పడ్డారు
కాగా, సరళాసాగర్ ప్రాజెక్టు ఆనకట్టకు గండిపడిందని తెలుసుకున్న మంత్రి నిరంజన్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతామహంతి ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి పరిశీలించారు
అయితే 2009లో వచ్చిన వరదలకు అప్పట్లో పూర్తి స్థాయిలో నిండిన ప్రాజెక్టు ప్రస్తుతం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా గొలుసు కట్టు చెరువులను నింపుతూ వాగుల ద్వారా వచ్చిన నీటితో గత రెండు మూడు నెలల నుండి ప్రాజెక్టును నింపారు
దాంతో యాసంగి పంటలకు సిద్ధమైన తరుణంలోనే ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యామని వాపోతున్నారు
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం మంగళవారం గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేసింది
ఆర్ఎస్ఎస్, ఎంఐఎం సభలకు అనుమతి ఇచ్చి కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీని అడ్డుకున్నట్టు వారు వివరించారు
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్కు తాను ఫోను చేయగా దురుసుగా మాట్లాడినట్టు ఉత్తమ్కుమార్రెడ్డి గవర్నర్కు వివరించారు
తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పినప్పటికీ అనుమతించలేదని పేర్కొన్నారు
గవర్నర్ను కలిసిన అనంతరం ఉత్తమ్కుమార్రెడ్డి మీడియా తో మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీసులు సామా న్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు
ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినట్టు చెప్పారు
విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలపై గవర్నర్కు అధికారం ఉన్న విషయాన్ని గుర్తు చేసినట్టు తెలిపారు
సేవ్ కాన్స్టిస్టూట్యూషన్ నినాదంతో ర్యాలీ నిర్వహించేందుకు పోలీసులను అనుమతి కోరామన్నారు
అయితే అనుమతి ఇవ్వకపోగా తమ కార్యకర్తలను అరెస్టు చేశారని ఆరోపించారు
తమకు అనుమతించకపోవడానికి తమదేమైనా నిషేధిత పార్టీనా? అని ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు
నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆంధ్రా కేడర్ అధికారి అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు
అంజనీకుమార్ వ్యవహరించిన తీరుతో పాటు ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని గవర్నర్ను కోరినట్టు తెలిపారు
ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయించి టీఆర్ఎస్లో చేరే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు
అధికార పార్టీ అండ చూసుకొని పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్కుమార్రెడ్డి దుయ్యబట్టారు
బీఆర్కే భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ, ప్రభుత్వం నిర్ణయించుకున్న లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కృషి చేస్తానని అన్నారు
పద వీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్కు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నలుగురు సీఎస్లుగా బాధ్యతలు నిర్వర్తించగా, సోమేష్ కుమార్ ఐదో అధికారి
గత రెండేళ్లుగా సీఎస్ బాధ్యతలను నిర్వర్తించిన ఎస్
జోషి మంగళవారంనాడే పదవీ విరమణ చేశారు
జోషి నుండి సోమేష్కుమార్ బాధ్యతలను తీసుకున్నారు
జోషిని నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో జోషితో పాటు, సోమేష్ కుమార్ కూడా ఉత్సాహంగా కనిపించారు
కొత్త సీఎస్ సోమేష్ కుమార్ 1989 ఐఏఎస్ బ్యాచ్కు చెందినవారు
ఇప్పటివరకు ఆయన రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్గా పనిచేస్తూ వచ్చారు
సీసీఎల్ఏగా అదనపు బాద్యతలు నిర్వర్తించారు
సోమేష్కుమార్ భార్య ఎన్ఐఆర్డీలో డీన్గా పనిచేస్తున్నారు
వీరి కుమార్తె సాయి గరిమ ఆర్ట్స్ గ్రాడ్యుయేట్
తెలంగాణ క్యాడర్లో సోమేష్ కుమార్ కంటే ముందు 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు
వీరంతా 1983 నుండి 1988 బ్యాచ్లకు చెందినవారు
వీరిలో కొంతమంది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు
వీరందరికంటే జూనియర్ అయిన సోమేష్ కుమార్ సీఎస్గా బాగా పనిచేస్తారన్న నమ్మకంతో కేసీఆర్ అవకాశం ఇచ్చారని నిపుణులు భావిస్తున్నారు
సోమేష్కుమార్ పదవీ విరమణ చేసేందుకు మరో నాలుగేళ్ల కాలం ఉంది
దాంతో రాష్ట్ర పరిపాలనా వ్యవహారాల్లో సుస్థిరమైన బాధ్యతల్లో కొనసాగేందుకు అవకాశం ఉండడం వల్లనే సోమేష్ కుమార్కు కేసీఆర్ అవకాశం ఇచ్చారని భావిస్తున్నారు
గత రెండేళ్లుగా సీఎస్గా పనిచేసిన ఎస్కే జోషి మంగళవారం పదవీ విరమణ చేశారు
ఆయనకు బీఆర్కే భవన్లో ఘనంగా వీడ్కోలు, సోమేష్కుమార్కు స్వాగత సభ ఏర్పాటు చేశారు
పలువురు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా మాట్లాడారు
పరిపాలనలో తనకు సహకరించిన వారందరికీ జోషి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు
మంగళవారం నాడు ఆయన పార్టీ రాష్టక్రార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు
బీఆర్కే భవన్లో సచివాలయ కార్యాయాలు ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియని గందరగోళం నెలకొందని పేర్కొన్నారు
ఇటీవల వాటర్వర్క్సు బోర్డు కార్యలయం నుండి ఒక లేఖను సచివాలయానికి పంపితే ఎడ్రస్ నాట్ ట్రేస్డ్ పేరుతో వెనక్కు వచ్చిందని ప్రభాకర్ చెప్పారు
అంటే చివరికి పోస్టల్ శాఖ సైతం చిరునామాలను గుర్తించలేకపోతోందని వ్యాఖ్యానించారు
దీనివల్ల సామాన్యుల ఈతిబాధలు ఇన్నీ అన్నీ కావని అన్నారు
పనిలేని, పనికిరాని మంత్రులు ఎక్కువగా ఉన్నారని, రిటైరైన అధికారులను ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పదవుల్లో నియమించారని, అయినా ప్రజాసమస్యల పరిష్కారం జరగడం లేదని అన్నారు
సీఏఏను, ఎన్ఆర్సీని, ఎన్పీఆర్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో విపక్షాలకు స్పష్టత లేదని ప్రభాకర్ విమర్శించారు
ఎంఐఎంను సంతుష్టీకరించేందుకే టీఆర్ఎస్ ఎత్తుగడ మాత్రమేనని అన్నారు
సీఎం రాష్ట్రంలో సకల జనుల సర్వే నిర్వహించినపుడు లేని అభ్యంతరాలు నేడు ఎన్పీఆర్కు ఎందుకని నిలదీశారు
మహిళల భద్రత, సాధికారతపై సఖీ సెంటర్స్, ఉజ్వల, స్వధార్, మహిళా శక్తి కేంద్రాల ప్రతినిధులతో మర్రిచెన్నారెడ్డి మానవ వనుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన రాష్టస్థ్రాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు
18 ఏళ్లలోపు మహిళలకి సమస్యలు వస్తే వారి రక్షణ, ఆవాసం కోసం జనవరి నెలలో వారి కోసం ప్రొటక్షన్ సెంటర్ ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు
పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేసి రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తున్న సీఎం కేసీఆర్ ప్రజల దృష్టిని మరల్చేందుకు మానేరు నది సందర్శన చేపట్టారని ఆరోపించారు
మిత్రపక్షం ఎంఐఎంను ఖుషీ చేసేందుకు సీఏఏను వ్యతిరేకించిన కేసీఆర్ ఈ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకించారో సరైన కారణాన్ని ఇప్పటికీ చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలనుందని, ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటించారని అన్నారు
గత పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ను చావుదెబ్బకొట్టిన బీజేపీపై కేసీఆర్ ఇంకా అక్కసు వెళ్లగక్కుతునే ఉన్నారని ప్రతిపక్ష పార్టీలకు భౌగోళిక పరిస్థితులపై అవగాహన లేదని, సాంకేతిక పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం లేదని వ్యాఖ్యానించడం ముఖ్యమంత్రి తన స్థాయిని తక్కువ చేసుకోవడమేనని అన్నారు
ప్రతిపక్ష పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు
అవినీతిలో కూరుకపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై దుమ్మెత్తి పోసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడటం సరైంది కాదని చెప్పారు
రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరగడం వాస్తవమని, ప్రభుత్వ ఇంజనీర్లు ఇచ్చిన డిజైన్ను మార్చి కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించిన ఘనత కేసీఆర్దేనని అన్నారు
ఈ ప్రాజెక్టులో అవినీతి లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుపైన రాష్ట్ర ప్రభుత్వం శే్వతపత్రం ఇవ్వడానికి ఎందుకు వెనుకంజ వేస్తోందో చెప్పాలని అన్నారు
బీజేపీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ప్రాజెక్టు కట్టాలనేదే బీజేపీ విధానమని, అందుకే నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చిందని అన్నారు
మానేరు డ్యాం సందర్శించిన సీఎం అలాగే గ్రామాలను కూడా సందర్శించాలని చెప్పారు
అక్కడున్న దుర్భర పరిస్థితులను గమనించాలని అన్నారు
రాష్ట్రంలో మున్సిపాల్టీల పరిస్థితి చాలా అధ్వన్నంగా ఉందని ఒక వైపు ముస్లింల సంతుష్టీకరణ, మరో వైపు పాలనా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని అన్నారు
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, రుణమాఫీ కాకపోవడం లాంటి అనేక వైఫల్యాలు టీఆర్ఎస్ను వెంటాడుతున్నాయని చెప్పారు
కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి ప్రజాకర్షణ పెరిగిందని, 370 ఆర్టికల్ రద్దు, రామజన్మభూమి వివాదం సామరస్యంగా పరిష్కరించడం, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి నిర్ణయాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ట పెరిగిందని అన్నారు
టీచ్ వన్ నినాదంతో వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నూతన సంవత్సరంలో ప్రతిన పూనాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు
ప్రతి చదువుకున్న వ్యక్తీ నిరక్షరాస్యుడైన మరొకరిని అక్షరాస్యునిగా మార్చాలని అన్నారు
తెలంగాణ సంపూర్ణ అక్షరాస్యత సాధించే సవాల్ను స్వీకరించాలని సీఎం పిలుపునిచ్చారు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షల సందేశాన్ని ఇచ్చారు
రాష్ట్రం ఆవిర్భావించి కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే అనేక అంశాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలువడం గర్వకారణమని అన్నారు
సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మరింత ముందడుగు వేస్తుందని ఆకాంక్షించారు
ఆరేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తూ గొప్ప విజయాలు సాధించింది
అనేక అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచి పలువురి ప్రశంసలు అందుకుంది
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది
అనతికాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణం
ఉద్యమ సమయంలో అనుకున్న విధంగానే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోంది
అంధకారమైన రాష్ట్రాన్ని ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దడం రాష్ట్రం సాధించిన గొప్ప విజయాల్లో ప్రథమంగా నిలుస్తుంది
గతంలో ఎన్నడూ లేని విధంగా 11,703 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడినప్పటికీ ఏ మాత్రం కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయగలిగే సామార్ధ్యాన్ని రాష్ట్రం సాధించింది