Sentence
stringlengths 7
4.52k
|
---|
బిల్లుల విషయంలో ఉపసర్పంచ్లు ఇబ్బంది పెడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని దయాకర్రావు తెలిపారు |
వైకుంఠధామం, నర్సరీ, డంపింగ్యార్డు, ఇంకుడుగుంతల నిర్మాణాలు పూర్తిచేసిన గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు |
రెండవ విడత పల్లె ప్రగతిని సవాలుగా తీసుకొని సమష్టిగా కృషిచేసి విజయవంతం చేద్దామని దయాకర్రావు తెలిపారు |
గ్రామపంచాయతీలు పారిశుద్ధ్య పనుల కోసం ట్రాక్టర్లు తీసుకోవాలని, వాటి నిర్వహణకు ఉపాధిహామీ పథకాన్ని వినియోగించుకోవాలని తెలిపారు |
గత సర్పంచ్లకు ఇప్పుడున్న సర్పంచ్లకు ఉన్న అధికారులు, నిధులు లేవని ఇప్పుడు సర్పంచ్లుగా ఉన్న వారు తమ పనితీరును మెరుగ్గా నిర్వహిస్తే చరిత్రలో నిలిచిపోతారన్నారు |
మీ గ్రామాల్లో పుట్టిన బిడ్డలు రాష్టస్థ్రాయిలో, జాతీయస్థాయిలో ఉన్నతస్థానంలో ఉన్న వారందరి పేర్లతో ఒక జాబితా తయారుచేసుకోవాలని, గ్రామానికి సేవ చేసేందుకు వారిని ఆహ్వానించాలని చెప్పారు |
దాతల పేర్లు గ్రామ పంచాయతీ కార్యాలయ బోర్డులపై ఉండాలని, గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం పూర్తిస్థాయిలో అమలు అయ్యేలా చూడాలని కోరారు |
100కోట్ల నిధులు మరుగుదొడ్ల నిర్మాణం కోసం రానున్నాయని రెండవ విడత ప్రణాళికతో గ్రామాల రూపురేఖలే మారిపోవాలని మంత్రి దయాకర్రావు కోరారు |
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహిళా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, శాసన మండలి చీఫ్ విప్ బి |
వెంకటేశ్వర్లు, రైతుసమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు సుధీర్కుమార్, గండ్ర జ్యోతి, ఎంపిలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, చల్ల ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు |
పల్లె ప్రగతి అవగాహన సదస్సులో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరైన కార్యకర్తలు, ప్రజలు |
ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగిన జిల్లా స్థాయి మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సభకు డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన కుంతియా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు శ్రీకారం చుట్టాయని ఆరోపించారు |
కేంద్రంలోని బీజేపీతో టీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు |
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకపోగా, ఆర్ఎస్ఎస్ సమావేశానికి మాత్రం పర్మిషన్ ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? అని ప్రశ్నించారు |
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నియంతృత్వ వైఖరిని ప్రజలకు తెలియజెప్పి మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు |
హైదరాబాద్లోని ధర్నా చౌక్ను తొలగించి నియంత పాలన సాగిస్తున్న కేసీఆర్ను ఇంటికి పంపాలని అన్నారు |
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పీసీసీ, డీసీసీ నాయకులు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ విధానాలను ఎండగట్టి అభ్యర్థులకు మనో ధైర్యాన్ని అందించాలని సూచించారు |
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాచాటాలని అన్నారు |
కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, బోస్రాజు, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకొని టీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు |
మున్సిపల్ పరిధిలోని కాలనీల్లో పారిశుద్ధ్యం లోపించిందని, తాగునీటి సౌకర్యం కరువైందని అన్నారు |
రాష్ట్ర నాయకులు లక్ష్మీరవీందర్రెడ్డి, ఆంజనేయులుగౌడ్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పందులు, దోమలు, ఈగలు తిరుగుతున్నప్పటికీ పట్టించుకునేవారు కరవయ్యారని ఆరోపించారు |
నర్సాపూర్లో నిర్మిస్తున్న డబుల్బెడ్ రూంలు నాలుగేళ్లు గడిచిన పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు |
కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మానయ్య, సుప్రభాతరావు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, అంజిరెడ్డి, సురేందర్గౌడ్, శ్రీనివాస్గౌడ్, గాలి అనిల్కుమార్ పాల్గొన్నారు |
ఆదివారం నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతు పొరుగు దేశాల నుండి దేశంలోకి వస్తున్న శరణార్థుల కోసం కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తెచ్చిందన్నారు |
దేశ పౌరులెవరికీ వ్యతిరేకంగా లేనటువంటి పౌరసత్వ బిల్లుపై ఎంఐఎం దుష్ప్రచారం చేస్తూ మైనార్టీలను రెచ్చగొడుతుంటే ప్రతిపక్ష కాంగ్రెస్, టీఆర్ఎస్లు బాధ్యతారాహిత్యంగా ఎంఐఎంకు వంతపాడుతూ దేశ ప్రయోజనాల్ని సైతం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాయని లక్ష్మణ్ విమర్శించారు |
పార్లమెంట్లో పౌరసత్వ బిల్లుకు మద్దతునిచ్చిన ప్రతిపక్షాలు బయట ఆందోళనలకు దిగడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమన్నారు |
ప్రతిపక్షాల రచ్చ తప్ప దేశంలోని పౌరులెవరూ కూడా పౌరసత్వ బిల్లుకు గాని, ఎన్ఆర్పీకి గాని వ్యతిరేకంగా లేరన్నారు |
విభిన్న సిద్ధాంతాలు గల ప్రతిపక్షాలు బీజేపీని రాజకీయంగా, ప్రజాస్వామికంగా ఎదుర్కోలేక విభజన రాజకీయాలతో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నాయన్నారు |
రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్త్తోందన్నారు |
దేశ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కంటే ఎంఐఎంతో రాజకీయ ప్రయోజనాలే మిన్న అన్నట్టుగా సీఎం కేసీఆర్ వైఖరి ఉందన్నారు |
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం, ధనబలంతో గెలిచేందుకు ప్రయత్నిస్తుందన్నారు |
అయితే పట్టణ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీఆర్ఎస్ సాగిస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని, వారంతా టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు |
రాష్ట్రంలో, జిల్లాలో బీజేపీ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉందని, పట్టణ ఓటర్లలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన పట్ల, కేంద్ర పథకాల పట్ల మంచి ఆదరణ ఉందన్నారు |
జమ్మూకాశ్మీర్ సమస్య, ఆయోధ్య సమస్య పరిష్కారంతో బీజేపీ పరిపాలనపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందని, ప్రపంచ స్థాయిలో దేశ ప్రతిష్టను పెంచుతున్న ప్రధాని మోదీ పాలనకు దన్నుగా విద్యావంతులు, పట్టణ ఓటర్లు కదులుతున్నారన్నారు |
మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా గణనీయ విజయాలతో బీజేపీ సత్తా చాటబోతుందన్నారు |
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాలనా విజయాలను బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయాలు సాధించేందుకు కృషి చేయాని లక్ష్మణ్ కోరారు |
కేంద్ర ప్రభుత్వ పథకాలు అమృత్, యూజీడీసీ, దీన్ దయాళ్, ఐపీడీఎస్ వంటి పథకాలతో మున్సిపల్ ప్రాంతాల అభివృద్ధికి అవకాశమున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని సకాలంలో పూర్తి చేయించలేకపోగా, జరిగిన పనులను రాష్ట్ర ప్రభుత్వ ఘనత ప్రచారం చేసుకుంటోందన్నారు |
టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు గాని, నిరుద్యోగులకు భృతి గాని, రైతులకు రుణమాఫీ గాని, కేజీ టూ పీజీ ఉచిత విద్యగాని ప్రజలకు అందలేదన్నారు |
ఉద్యమ ఆకాంక్షలను, ఎన్నికల హామీలను తుంగలో తొక్కి రాష్ట్రాన్ని దివాలా తీయించి అప్పుల పాలు చేసిన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి పట్టణ ఓటర్లు ఇచ్చే తీర్పు గుణపాఠం కావాలన్నారు |
ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్రెడ్డి, స్వచ్ఛ భారత్ కన్వీనర్ గార్లపాటి జితేంద్రకుమార్, రాష్ట్ర, జిల్లా నాయకులు రామోజీ షణ్ముఖ, వీరెల్లి చంద్రశేఖర్, మాదగోని శ్రీనివాస్గౌడ్, బండారు ప్రసాద్, చింతా ముత్యాల్రావు, బాకి పాపయ్య, పెరికె మునికుమార్, రాజశేఖర్రెడ్డి, భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు |
ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆయన విలేఖరులతో మాట్లాడారు |
తాగునీరు, సాగునీరుతో పాటు హరిత తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ చేపడుతున్న పథకాలు సత్ఫలితాలిస్తుండగా, రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత తెలంగాణగా చేయడానికి ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని ప్రశంసించారు |
ముఖ్యంగా పల్లెప్రగతి కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి దోహద పడనుండగా, మొక్కల పెంపకంతో చక్కటి వాతావరణం సమకూరి ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దబడడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినట్టవుతుందని తెలిపారు |
నదుల అనుసంధానం చేసి నీటి వసతులు జరిగే వివిద కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చక్కటి పాలన అందిస్తున్నట్టు చెప్పారు |
పేద విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసి నిదులు కేటాయిస్తుండగా, బీసీ, మైనార్టీ, ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ సర్కార్ విశేషంగా కృషి చేస్తున్నట్లు వివరించారు |
మూడు రోజుల కిందట 17 |
2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రెండు రోజుల వ్యవధిలోనే 12 డిగ్రీలు తగ్గిపోవడం గమనార్హం |
శనివారం ఆదిలాబాద్ జిల్లాలో 7 |
1 డిగ్రీజ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, భీకరమైన చలి గాలులు, దట్టమైన పొగ మంచుతో ఆదివారం రికార్డు స్థాయిలో 5 డిగ్రీలకు చేరుకోవడం చలి ఉద్ధృతికి అద్దం పడుతోంది |
పెరుగుతున్న చలి కారణంగా ప్రజలు ఉదయం 11గంటల వరకు ఇంటి గుమ్మం దాటి బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది |
ఆకాశం మబ్బు పట్టి పొగమంచు ఆవరించడం, చల్లని గాలులు వీస్తుండటంతో ఆర్టీసీ బస్టాండులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు |
ఆదివారం రాత్రి వరకు ఆకాశం మబ్బు పట్టడంతో చలి ఉద్ధృతి కారణంగా జనజీవనం అంతటా స్తంభించిపోయింది |
ఉత్తరాది రాష్ట్రాల నుండి వీస్తున్న చలి గాలుల వల్ల ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత ఇదేవిధంగా ఉంటుందని, మరో మూడు రోజుల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు |
అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి వెళ్లవద్దని, ఇంటి వద్ద ఉండటమే శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు |
ఇదిలా ఉంటే అమాంతంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి నుంచి రక్షణ కోసం ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు, రగ్గుల కోసం ప్రజలు దృష్టి సారిస్తున్నారు |
ఇదిలా ఉంటే బోథ్, ఇచ్చోడ, ఆసిఫాబాద్, ఊట్నూరు, జైనూర్, బజార్హత్నూర్ అటవీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉంది |
కనిష్ట ఉష్ణోగ్రతల ధాటికి రైతులు, సామాన్య ప్రజలు, కూరగాయలు, పాలు అమ్ముకునే చిరు వ్యాపారులు, పారిశుద్ధ్య కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు |
మధ్యాహ్న వేళలో కూడా చలి గాలులు వీస్తుండటంతో మహిళలు, పిల్లలు అవస్థలకు గురి కావాల్సి వస్తోంది |
మూడు రోజుల కిందట 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే రెండు రోజుల్లోనే అమాంతం 5 డిగ్రీలకు చేరుకోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది |
ఈ సీజన్లో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడం తెలంగాణలోనే తొలిసారి అని ఆదిలాబాద్ వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు |
గాలిలో తేమ శాతం పెరిగిపోవడం, జిల్లాలో అటవీ ప్రాంతం దట్టంగా ఉండటం, వాతావరణంలో నెలకొన్న మార్పుల ప్రభావంగానే చలి తీవ్రత పెరుగుతోందని నిపుణులు అంటున్నారు |
ఇదిలా ఆదిలాబాద్, ఊట్నూరు ప్రభుత్వ ఆస్పత్రులకు విష జ్వరాలు, చర్మ వ్యాధులు, శ్వాస సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడుతూ రోగులు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు |
తెల్లవారుజామున విపరీతంగా మంచు కురుస్తుండటంతో ఉదయంపూట పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చిన్నారులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది |
పల్లెల్లో ఉదయం, రాత్రి వేళల్లో ప్రజలు చలి దాటి నుండి రక్షించుకునేందుకు చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు |
ఈ గ్రామంలో భక్తులంతా ఆధ్యాత్మిక ప్రవచన అనంతరం సహపంక్తి భోజనాలకు వెళ్లగా సాత్విక భోజనం తీసుకున్న అనంతరం గంటలోపే వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు |
మొత్తం 220 మంది భోజనం చేయగా, వీరిలో 172 మంది వాంతులు, విరేచనాలతో ఇంటికి తిరుగు ముఖం పట్టారు |
విషయం తెలియగానే రిమ్స్ నుంచి అంబులెన్స్లు ఆ గ్రామానికి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురైన 43 మందిని రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు |
ఆదివారం రాత్రి వరకు పరిస్థితి అదుపులోనే ఉందని, ముగ్గురు చిన్నారులు అపస్మారక స్థితిలో ఉన్నట్టు వైద్యులు తెలిపారు |
సాత్విక భోజనం ఆరగించిన భక్తులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరడం అలజడి రేపింది |
సాయంత్రం ఎమ్మెల్యే జోగు రామన్న రిమ్స్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ను కోరారు |
కంపెనీల్లో పనిచేస్తూ కుటుంబాలకు చేదుడుగా నిలుస్తున్న యువకులు |
బీసీ, దళిత, గిరిజన, మైనార్టీ కుటుంబాల ఆవాసమైన ఈ పంచాయతీలో ఒక్కసారిగా చైతన్యం రగులుకుంది |
ఇంకేముందు పదివారాల వ్యవధిలోనే పచ్చదనం, పరిశుభ్రతను పరఢవిల్ల జేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నయనానందకరంగా మార్చివేసారు |
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో మారుమూలన ఉన్న హరిదాస్పూర్ గ్రామ ప్రజల్లో పల్లె ప్రగతి కార్యక్రమం అద్భుతాల సృష్టికి ఆలవాలమైంది |
ఓ యువత మేలుకో, నీ దేశాన్ని ఏలుకో అన్న వివేకుడి సూక్తి ఆ గ్రామానికి చెందిన యువకుల్లో అణువణువునా స్ఫూర్తిని నింపింది |
పని చేసిన చోటల్లా తనకంటూ ప్రత్యేకను చాటుకుని అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న డీఆర్డీఓ సీహెచ్ |
శ్రీనివాస్రావు పల్లె ప్రగతి కార్యక్రమంలో హరిదాస్పూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు |
తన నేతృత్వంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన మల్కాపూర్ గ్రామంలో అమలు చేసిన పద్ధతులను హరిదాస్పూర్ యువతలో అవగాహన కల్పించారు |
దృఢమైన సంకల్పంతో ముందుకుసాగితే సాధించలేనిదంటూ లేదని పట్టును రగిలింపజేసారు |
యువకుడైన సర్పంచ్ షఫీ తన పరిపాలన తీరును ఆదర్శంగా నిలుపుకోవాలనే ఉత్సాహాన్ని కనబరిస్తే |
ఉన్నత విద్యావంతుడై గ్రామ కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రోహిత్ కులకర్ణి జతకలిసి పల్లెను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు |
ఏ ఇంటి ముందు చిన్న పాటి ఖాళీ స్థలం కనిపించినా అక్కడ మొక్కలు నాటించి వాటిని సంరక్షించే బాధ్యతను గృహస్థులకు అప్పగిస్తున్నారు |
బహిరంగ మలవిసర్జనతో జుగుప్సాకరంగా కనిపించే ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మింపజేసి వాడుకునేలా అందరికీ అవగాహన కల్పించారు |
గ్రామంలో మద్యం అమ్మకాలు లేకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుని, అమ్మినా, కొన్నా జరిమానాలు విధిస్తున్నారు |
నోటి క్యాన్సర్, గుండె జబ్బులు, అస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులకు హేతువుగా మారిన పొగాకు ఉత్పత్తులైన బీడీ, సిగరెట్, గుట్కా, జర్దాల విక్రయాలు, వినియోగాలను కూడా నిషేధించడానికి గ్రామ యువకులు సిద్ధమవుతూ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచేందుకు ఆలోచన చేస్తున్నారు |
వ్యర్ధపదార్థాలను ఎక్కడపడితే అక్కడ పారబోయకుండా కూడళ్లలో ఏర్పాటు చేసిన చెత్త కుండీల్లో వేసేలా చర్యలు చేపట్టారు |
ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న ఓ చెట్టుకు సైతం చెత్తబుట్టను ఏర్పాటు చేసి పరిశుభ్రతను పాటించేందుకు వీలుకల్పించడం విశేషం |
బహిరంగ మలవిసర్జన చేయకుండా సెక్యూరిటీ గార్డులుగా రాత్రి, తెల్లవారుజాము ప్రాంతంలో బృందాలుగా ఏర్పడి గస్తీలు నిర్వహించారు |
ఎవరైనా బహిరంగ మలవిసర్జనకు వెళితే ఆ ఇంటి యజమాని బాధ్యత వహిస్తూ మొదటిసారి రూ |
500, రెండవ సారి రూ |
1500 జరిమానాతో పాటుగా గ్రామంలో నాటించిన మొక్కలన్నింటికీ నీరు పోయాలన్న నిబంధనలు విధించారు |
గ్రామంలో ఉండకుండా ఇంటిని అద్దెకు ఇచ్చిన వారి ఇళ్ల వద్ద కూడా మరుగుదొడ్లు నిర్మింపజేసారు |
ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను నిర్మింపజేస్తూ భూగర్భ జల పరిరక్షణకు చర్యలు చేపట్టి త్వరలోనే వందశాతం సాధించేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు |
ఇంకుడు గుంతల నిర్మాణంతో మురుగు కాలువలన్నీ పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి |
వంద రోజుల్లోనే సుమారుగా 25 వేల మొక్కలను నాటి ట్రీ గార్డులు ఏర్పాటు చేసి పరిరక్షించుకుంటున్నారు |
ఇంటి ముంగిళ్లలో ఉన్న ఖాళీ స్థలంలో పూల మొక్కలను నాటడమే కాదు |
వాటిని పశువులు తిని పాడుచేయకుండా పాత చీరలను ప్రహరీగా ఏర్పాటు చేసి ప్రాచీణ పరిరక్షణ పద్ధతులను ఈ గ్రామ మహిళలు గుర్తుకు చేస్తున్నారు |
చిన్న కుటుంబాల ఆర్థిక వ్యవస్థకు పెనుభూతంలా మారిన బెల్టు షాపులు లేకుండా గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయడం గమనార్హం |
హరిదాస్పూర్ గ్రామ పంచాయతీ దరిదాపుల్లో ఉన్న రెండు గిరిజన తండాలు సైతం ఔరా అనిపిస్తూ పచ్చదనం, పరిశుభ్రతతో అబ్బుర పరుస్తున్నాయి |
తారు, సీసీ రోడ్లు సైతం అస్తవ్యస్తంగా కనిపించడం పరిపాటి |
Subsets and Splits